తెలుగోడి విధ్వంసం
పంజాబ్‌కు ముంబై షాక్
దంచికొట్టిన తిలక్ వర్మ
పంజాబ్‌కు వరుసగా 5వ ఓటమి
ఐపీఎల్ 19వ సీజన్ సెకండాఫ్‌లో పంజాబ్ కింగ్స్ రాత మారలేదు. ఫస్టాఫ్‌లో వరుస విజయాలతో అదరగొట్టిన ఆ జట్టు ఇప్పుడు వరుస పరాజయాలతో సతమతమవుతోంది. తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ(75 నాటౌట్) విధ్వంసం సృష్టించిన వేళ ధర్మశాలలో పంజాబ్‌కు మరో ఓటమి ఎదురైంది. భారీస్కోరు చేసినా పేలవమైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను చేజార్చు కుంది. వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడిన పంజాబ్ మిగిలిన రెండింటిలోనూ ఖచ్చితంగా గెలిస్తేనే ప్లే ఆఫ్స్ చేరుతుంది.
ధర్మశాల, మే 14: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. బుమ్రా వేసిన రెండో ఓవర్లోనే ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఇచ్చిన ఈజీ క్యాచ్ ను నమన్ ధీర్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో అతను చెలరేగాడు. అటు దూకుడుగా ఆడేందుకు ఇబ్బంది పడిన ప్రియాన్ష్ ఆర్య(22)ను దీపక్ చాహర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. పవర్ ప్లేలో పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. భారీ సిక్స్లతో విరుచుకుపడిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 29 బంతు ల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లున్నాయి. కానీ అతడు ఔట్ అయిన తర్వాత మ్యాచ్ గమనమే మారిపోయింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అదే ఓవర్లో శ్రేయస్ అయ్యర్(4)కాసేపటికే కూపర్ కానోల్లీ(21)కూడా ఔటయ్యారు. అజ్మతుల్లా ఒమర్జాయ్ జట్టు స్కోర్ను 200కు చేర్చాడు. ఛేజింగ్‌లో ముం బై కూడా రెచ్చిపోయింది. పిచ్ బ్యాటింగ్‌కే అనుకూలంగా ఉండడంతో ఓపెనర్లు రోహిత్ శర్మ, రికెల్టన్ బౌం డరీలతో విరుచుకుపడ్డారు.
తొలి వికెట్‌కు 6.3 ఓవర్ల లోనే 61 పరుగులు జోడించారు. రికెల్టన్ 23 బంతు ల్లో 48 (4 ఫోర్లు,4 సిక్సర్లు) రన్స్‌కు ఔటవగా.. కాసేపటికే రోహిత్ శర్మ 25, నమన్ ధీర్ 9 పరుగులకే వెనుదిరిగారు. ఈ దశలో తిలక్ వర్మ, రూథర్‌ఫర్డ్ ముంబై ఇన్నింగ్స్ నడిపించారు. ఈ క్రమంలో తిలక్ వర్మ 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు రూథర్‌ఫర్డ్(20) ఔటవడంతో ఉత్కంఠ నెలకొంది. విల్ జాక్స్‌తో కలిసి తిలక్ మరింత దూకుడుగా ఆడాడు. దీంతో ముంబై మరో బంతి మిగిలుండగా టార్గెట్‌ను అందుకుంది. ముంబైకి ఇది నాలుగో విజయం. అటు పంజాబ్‌కు వరుసగా ఐదో ఓటమి.
స్కోరు బోర్డు
పంజాబ్ ఇన్నింగ్స్ : 200/8 ( ప్రభ్‌సిమ్రన్ సింగ్ 57, అజ్మతుల్లా38 , కూపర్ 21; శార్థూల్ 4/39, దీపక్ చాహర్2/36 )
ముంబై ఇన్నింగ్స్ : 205/4 ( తిలక్ వర్మ 75, రికెల్టన్ 48, విల్ జాక్స్ 25 నాటౌట్, అజ్మతుల్లా 2/36, చాహల్ 1/32)






