15 July, 2026 | 12:33 AM

ఫ్లాట్ కొనుగోలులో మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

15-07-2026 12:33 AM

బాధితుడు సురేష్ కుమార్

ముషీరాబాద్, జూలై 14(విజయక్రాంతి): ఖాజా గూడా ఫౌంటెన్ హెడ్  అపార్ట్మెంట్లో  కొనుగోలులో బిల్డర్స్, యూకో బ్యాంక్ అధికారులు కుమ్మక్కై తనను మోసం చేశారని  బాధితుడు ప్రైవేట్ ఉద్యోగి సురేష్ కుమార్ ఆరోపించారు.

ఈ మేరకు మంగళవారం హైదర్ గూడలోని ఎన్‌ఎస్‌ఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితుడు సురేష్ కుమార్ మాట్లాడుతూ ఆగస్టు 2022 సంవత్సరంలో అపార్ట్మెంట్లో కౌంటర్ హెడ్ అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్ నెంబర్ 105, 2 కోట్ల 55 లక్షలకు  కొనుగోలు చే యడం జరిగిందని వివరించారు.    కొనుగో లు సమయంలో ప్లాట్ 2350 స్క్వేర్ ఫీట్ ఉందని బ్యాంక్ అధికారులు1కోటి 85 లక్ష లు లోన్ మంజూరు చేశారని చెప్పారు. మిగ తా బ్యాలెన్స్ అమౌంట్ 68 లక్షలు పలు ద ఫాలుగా బిల్డర్ కు చెల్లించడం జరిగిందని వివరించారు.

కాగా ఆ తర్వాత ప్రైవేట్ వ్యక్తులతో తమ ఫ్లాట్ ను లెక్కించగా 1326 స్క్వేర్ ఫీట్స్ మాత్రమే ఉందని చెప్పారు. దీనిపై బ్యాంక్ అధికారుల నిలదీయగా పొంతన లే ని సమాధానం చెబుతూ కాలయాపన చేస్తున్నారని వాపోయారు. ఈ విషయంపై రా యదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోలేదన్నారు. దీంతో హ్యూమన్ రై ట్స్‌ని ఆశ్రయించడం జరిగిందని ఆయన చె ప్పారు. హ్యూమన్ రైట్స్ నోటీసులతో  రా యదుర్గం పోలీసులు 2025 డిసెంబర్ 2 న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని సురేష్ కుమార్ తెలిపారు. కానీ ఇంతవరకు చార్జిషీట్ వేయడంలో జాప్యం చేస్తున్నారని ఆయన ఆవేద న వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు న్యాయం చేయాలని వేడుకున్నారు.