29 July, 2026 | 1:54 AM

టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నవీన్ గౌడ్ నియామకం

29-07-2026 12:00 AM

కొత్తపేట ఎన్టీఆర్ నగర్ డివిజన్ యువ నాయకుడికి కీలక బాధ్యతలు

నాగోల్, జూలై 28 (విజయ క్రాంతి): కొత్తపేట ఎన్టీఆర్ నగర్ డివిజన్కు చెందిన యువ నాయకుడు మునుకుంట్ల నవీన్ గౌడ్ తెలంగాణ రక్షణ సేన స్టూడెంట్ వింగ్ (టీఆర్‌ఎస్వీ) రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నవీన్ గౌడ్కు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో విద్యార్థి విభాగం మరింత బలోపేతం అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మునుకుంట్ల నవీన్ గౌడ్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను విద్యార్థుల్లో విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. యువతను సంఘటితం చేస్తూ తెలంగాణ రక్షణ సేనను మరింత బలోపేతం చేయడానికి అంకితభావంతో పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.