29 July, 2026 | 3:29 AM

ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్తుకు భరోసా

29-07-2026 12:00 AM

కృషి విజ్ఞాన కేంద్ర సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె ఇందు ధర్ రెడ్డి

బోధన్, జూలై 28 (విజయ క్రాంతి): ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్తుకు భరోసా అని రుద్రూర్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కే ఇందు ధర్ రెడ్డి అన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా రుద్రూరులోని రైతు వేదికలో ‘రైతు నేస్తం‘ 100వ ఎపిసోడ్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జరై మాట్లాడారు.ప్రకృతి వ్యవసాయంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించారు.

అధిక మొత్తంలో రసాయన ఎరువులు , పురుగుమందులను వినియోగించడం వల్ల నేలలోని ప్రయోజనకర సూక్ష్మజీవులు నశించి భూసారం క్రమంగా తగ్గిపోతుందని అన్నారు. భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులు విస్తృతంగా అవలంబించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రుద్రూరు మండల వ్యవసాయ అధికారి  సాయికృష్ణ, వ్యవసాయ విస్తరణ అధికారి వెంకటేష్, వ్యవసాయ కళాశాల విద్యార్థినులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.