29 July, 2026 | 2:48 AM

మార్కెట్ కమిటీ అభివృద్ధికి రూ.58 లక్షలు మంజూరు

29-07-2026 12:00 AM

పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

మార్కెట్ కమిటీ చైర్మన్ బండారి పరమేశ్వర్ 

గాంధారి, జూలై 28 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో పలు అభివృద్ధి పనులను మంగళవారం మార్కెట్ కమిటీ చైర్మన్ బండారి పరమేశ్వర్ ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ గాంధారి మార్కెట్ కమిటీ అభివృద్ధికై రూ.58 లక్షల నిధులు మంజూరు చేశారని అన్నారు. ఇందులో భాగంగా పలు అభివృద్ధి పనులు చేపట్టినట్టు ఆయన తెలిపారు.

మార్కెట్ కమిటీ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ కు స్థానిక నాయకులు , రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్, పాక్స్ ఛైర్మన్ పెద్దబూరి సాయికుమార్, గాంధారి ఉప సర్పంచ్ భాస్కర్ గౌడ్, మార్కెట్ కమిటీ పాలక వర్గం, సీనియర్ నాయకులు తూర్పు రాజులు, ముకుంద్ రావ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బిస గణేష్, బొమ్మని బాలయ్య, సంగని బాబా,నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు..