జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు మాత్రల పంపిణీ
కల్లూరు,జూలై 13(విజయ క్రాంతి): జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా కల్లూరులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ మోహన్ నాయక్, ఏఎంసీ చైర్మన్ నీరజ దేవి సంయుక్తంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్రలను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోందని తెలిపారు.
ఈ మాత్రల వలన కడుపులోని నులిపురుగుల నుండి విముక్తి లభించి,పిల్లలు సరైన పోషకాలను గ్రహించి శారీరకంగా దృఢంగా మారుతారని,చదువుల్లో కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తారని పేర్కొన్నారు.ప్రతి విద్యార్థి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాల్సిన అవసరం ఉందని సూచించారు.ఈ కార్యక్రమంలో కల్లూరు వైద్యాధికారి డాక్టర్ నవ్యకాంత్,మండల విద్యాశాఖ అధికారి పద్మ,కాంగ్రెస్ నాయకులు యాస శ్రీకాంత్,ఆరోగ్య సిబ్బంది, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.






