18 July, 2026 | 1:35 AM

నీట్ ఫలితాల్లో నారాయణ విద్యార్థుల హవా

18-07-2026 01:12 AM

రికార్డులతో కొనసాగిన విజయ పరంపర!

హైదరాబాద్, జులై 17 (విజయక్రాంతి): వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన రీ నీట్ ఆలిండియా ఆల్ కేటగిరీలలో నారాయణ విద్యార్థులు విజయదుందుభి మోగించారు. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో ఆర్యన్ గుప్తా(హాల్ టికెట్ నెం.2604100 23990) 1వ ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించారు.

అలాగే గౌరవ్ సింగ్(హాల్ టికెట్ నెం.260410079810), 9వ ర్యాంక్ క్రిష్ గుప్తా(హాల్ టికెట్ నెం.260411104787) 15వ ర్యాంక్, కార్తీక్ చౌదరి(హాల్ టికెట్ నెం.260410189559) 16వ ర్యాంక్‌తో సంచలన విజయం అందుకున్నారు. వీటితో పాటు22, 30, 31, 35, 39, 50, 56, 58, 71, 72, 76, 78, 79, 97 వంటి 100లోపు 18 ర్యాంకులు, వెయ్యి లోపు 49 ర్యాంకులు నారాయణ విద్యార్థులు కైవసం చేసుకున్నారు.

అలాగే ఆలిండియా అన్ని కేటగిరీల్లో 1,1,౨,౩,౩,౯,౯,౧౧,౧౨ లోపు 9 ర్యాంకులు, 100లోపు 45 ర్యాంకులు, వెయ్యిలోపు 163 ర్యాంకులు సాధింపజేసి సరికొత్త రికార్డు నెలకొల్పి ఆలిండియా ఆగ్రగామిగా నిలిచిందని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్స్ డాక్టర్ పి.సింధూరనారాయణ, పి.శరణినారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పి.సింధూర నారాయణ మాట్లాడుతూ ఆలిండియా ఓపెన్ కేటగిరిలో ఫస్ట్ ర్యాంకు సాధించడం నారాయణ విద్యా సంస్థకు ఎంతో గర్వకారణమన్నారు.

విశిష్టమైన ప్రణాళికలతో రూపొందించిన స్టార్ సీవో బ్యాచ్, ఎన్ 40 ప్రోగ్రామ్‌ల ద్వారా మాత్రమే టాప్ ర్యాంకుల సాధన నిరంతరాయంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. డైరెక్టర్ పి.శరణి నారాయణ మాట్లాడుతూ సీబీఎస్‌ఈ సిలబస్ ఆధారంగా చేసుకుని నిర్వహించబడుతున్న నీట్ పరీక్ష కోసం అత్యంత వినూత్న విద్యా ప్రణాళిక వలనే ఈ టాప్ ర్యాంకులు సాధించగలిగామని తెలిపారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపక, అధ్యాపకేతర బృందానికి నారాయణ విద్యా సంస్థల ఎగ్జ్యిక్యూటివ్ డైరెక్టెర్ పునీత్ కొత్తప అభినందనలు తెలియజేశారు.