నీట్ ఫలితాల్లో ‘అపోలో’ ప్రభంజనం
అత్యుత్తమ ర్యాంకులు సాధించిన మెడికల్ అకాడమీ విద్యార్థులు
హైదరాబాద్, జులై 17 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాలలో దిల్‌సుఖ్‌నగర్ ‘అపోలో’ మెడికల్ అకాడమీ ప్రభంజనం సృష్టించి అత్యుత్తమ ర్యాంకులు సాధించామని అపోలో మెడికల్ అకాడమీ చైర్మన్ పోసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అకాడమీలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థినీ విద్యార్థులను అభినందించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తమ అకాడమీ నుంచి 620 మంది నీట్ రాయగా 405 విద్యార్థులు మెడికల్ సీట్లతో పాటు, 720 మార్కులకు గాను యస్.నిఖిల్ 700 మార్కులు సాధించినట్లు తెలిపారు. విద్యా విధానంలో మార్పులకు అనుగుణంగా అనుభవజ్ఞులైన అధ్యాపక బృం దంతో బోధించడం వల్లనే అత్యుత్తమ ఫలితాలు రాబట్టగలిగామన్నారు. ఈ కార్యక్ర మంలో ప్రిన్సిపల్ అల్వాల మధుసూదన్, అధ్యాపకులు శ్రీధర్, రాజు, కేవీఆర్, సునిల్, ఎస్‌ఎంఆర్, హరిబాబు పాల్గొన్నారు.






