18 July, 2026 | 12:44 AM

యువత గొంతు నొక్కాలనే కుట్ర విఫలమైంది

18-07-2026 12:32 AM
  1. కాంగ్రెస్ మోసాలను ఎండగడదాం  
  2. రేవంత్ సర్కార్ మెడలు వంచుదాం
  3. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి) : సరూర్‌నగర్ స్టేడియంలో జరగబోయే యువ సంగ్రామ సదస్సును అడ్డుకొని, నిరుద్యోగ యువత గొంతు నొక్కుదామని ప్రయత్నించిన రేవంత్‌రెడ్డి కుట్ర విఫలమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తే హైకోర్టు ప్రజాస్వామ్య హక్కులను కాపాడుతూ, సదస్సుకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఎన్ని అవరోధాలు సృష్టించినా, యువత తరఫున బీఆర్‌ఎస్ పార్టీ గళం విప్పుతూనే ఉంటామన్నారు.