నీట్ ఫలితాలలో అల్ఫోర్స్ చారిత్రాత్మక విజయం
కరీంనగర్, జూలై 17 (విజయక్రాంతి): నీట్- 2026 ఫలితాలలో అల్ఫోర్స్ విద్యార్థు లు ప్రతిభ కనబరిచి చారిత్రక విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తమ విద్యా సంస్థకు చెందిన డి రిత్విక్ 647 మార్కులతో అత్యున్నత స్థానంలో, సిద్దాంత్ చతుర్వేది 564, సయ్యద్ మలాజుద్దీన్ 557, వసుల శ్రుత్విక 551, గులామ్ మహమ్మద్ హుస్సేన్ 548, బత్తు ల అభిజ్ఞ 541, లింగంపల్లి అనంత్ సాయి 540, నార్ల శ్రీహిత 538, శ్రేయాంశ్ ద్వివేది 537, కొండ్ల అక్షిత 522, బొమ్మవరపు రుత్విక్ 515, జక్కుల శ్రీవైత్రి 512, టి హర్షిత 509, సిద్దం సాత్విక 508, ఎ సత్య బ్రా హ్మిణి 507, బి అక్షర 505, నిద 502, గుం జేటి రిషిత 501, జహ్రా మాజీద్ 501 మా ర్కులు సాధించారని తెలిపారు.19 మంది విద్యార్థులు 500, ఆపై మార్కులు సాధించారని, 100 మంది విద్యార్థులు వివిధ ప్రతిష్టా త్మక మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించగలరన్నారు. విద్యార్థు లను, విజయానికి తోడ్పడిన అధ్యాపక, అధ్యాపకేతర బృందాన్ని నరేందర్ రెడ్డి అభినందించారు.






