18 July, 2026 | 1:44 AM

నార్కోటిక్ డిటెక్షన్ డాగ్స్‌తో తనిఖీలు

18-07-2026 01:11 AM

పోలీస్ కమిషనర్ సునీల్ దత్ 

ఖమ్మం, జులై 17 (విజయక్రాంతి): ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి ఖమ్మం జిల్లా మీదుగా జరుగుతున్న గంజా యి స్మగ్లింగ్ ను అరికట్టడానికి ఖమ్మం పోలీ స్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి ఖమ్మం పాత బస్టాండ్ స మీపంలో ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రా ష్ట్రాల నుండి వస్తున్న ప్రవేటు, ఆర్టీసీ బస్సులలో బ్యాగులు, పార్శిల్స్ ను టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సిఐ ఉదయ్ కుమార్, ఎస్త్స్ర కిరణ్, సిబ్బంది ‘నార్కోటిక్ డిటెక్షన్ డాగ్స్‘ తో తనిఖీలు నిర్వ హించారు.

గంజాయి రవాణాను అరికట్టేందుకు బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఇతర ప్రదే శాలలో ప్రత్యేక డ్రైవ్లో భాగంగా గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను పసిగట్టడానికి ప్రత్యేక శిక్షణ పొందిన జగిలాం (స్నిఫర్ డాగ్స్) పోలీసులు వినియోగిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు.

ఈ నార్కోటిక్ జాగిలం సహాయంతో పాన్ షా పులు, కిరాణా దుకాణాలు, బస్టాండ్లు, విద్యాసంస్థల పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, క్రయవిక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు ఈ తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు. డ్రగ్స్, గంజాయి యువత భవిష్యత్తును నాశనం చే స్తాయని పేర్కొంటూ విద్యార్థులు, యువత లో అవగాహన కార్యక్రమా లు నిర్వహిస్తున్న ట్లు వెల్లడించారు. డ్రగ్స్, గంజాయి విక్ర యం, రవాణా, వినియోగానికి సంబంధించి న సమాచారం ఉంటే పీఎస్‌కు, ఈగల్ ఫో ర్స్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.