20 July, 2026 | 4:10 AM

నాగిరెడ్డిపేట్ మండల సమాఖ్య సమావేశం

19-07-2026 05:12 PM

నాగిరెడ్డిపేట్ మండల సమాఖ్యను ఆదర్శవంతంగా తయారు చేయుటకు అందరి కృషి అవసరం

నాగిరెడ్డిపేట్,జులై 19 (విజయ క్రాంతి): మండలసమాఖ్య సమావేశం మండల సమాఖ్య కార్యాలయంలో ఇన్చార్జి ఏపిఎం కొమ్మ దత్తు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్చార్జి ఏపిఎం కొమ్మ దత్తు మాట్లాడుతూ...సమాఖ్యల పనితీరు,సంస్థాగత నిర్మాణం,బ్యాంకు లింకేజి , స్త్రీనిధి రుణాల రికవరీ,రుణాల పంపిణీ గురించి  లోకోస్ ఆప్లో సంఘాల వివరాల ఎంట్రీ,అజీవిక రిజిస్టర్,న్యూ ఎంటర్ ప్రైజెస్,ఫాం కార్యక్రమాలలో భాగంగా కోడి,మేక,గొర్రె పిల్లల పెంపకం,అదే విధంగా నాన్ ఫాం కార్యక్రమాలు,స్కూల్ పిల్లల యూనిఫాంలు తదితర స్త్రీశక్తి ద్వారా చేపట్టే వివిధ అభివృద్ధి కార్యక్రమాల అమలు,విఓఏల పనితీరు సెర్ప్ ద్వారా చేపట్టే వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరు తదితర అంశాల గురించి చర్చించడం జరిగిందనీ తెలిపారు.

మండలంలో స్త్రీనిధి రుణాల రికవరీలో వెనుకబడి ఉన్నందున రుణాల రికవరీ గురించి చర్చించడం జరిగింది.మండలంలోని వివిధ గ్రామాల్లో సిబ్బంది మరియు సబ్ కమిటీల బృందంచే స్పెషల్ రికవరీ డ్రైవ్ నిర్వహించి ఈనెలలో సుమారు 18 లక్షల పేరుకుపోయిన మొండి బకాయిల వసూళ్లు జరిగినట్లు చెప్పడం జరిగిందనీ ఇన్చార్జ్ ఏపిఎం కొమ్మ దత్తు తెలిపారు.ఇంకా మిగిలిన మొండి బకాయిలను వసూళ్లు చేయడాన్ని ప్రాధాన్యత అంశంగా తీసుకుని మొండి బకాయిలు లేని గ్రామ సంఘంగా నాగిరెడ్డిపేట మండల సమాఖ్యను ఆదర్శవంతంగా తయారు చేయాలని దీని కోసం అందరు సమాఖ్య ప్రతినిధులు,సెర్ప్ సిబ్బంది కృషి చేయాలని తీర్మానించడం జరిగింది.అదే విధంగా ఈవారంలో అన్ని గ్రామాల్లో వృద్ధుల,వికలాంగుల, కిషోరబాలికల నూతన సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించినదని,ఈ మేరకు ప్రతీ గ్రామంలో నూతన సంఘాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించడం జరిగింది.మండల సమాఖ్య ఈసి సభ్యులకు విధులు, బాధ్యతలు,సమాఖ్యల పనితీరు,పుస్తక నిర్వహణ,నిధుల వినియోగం మొదలగు అంశాలపై సీనియర్ సిఆర్ పిలు శిక్షణ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు బెస్త శాంత, కార్యదర్శి మంజుల,కోశాధికారి మమత,సీనియర్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ లు అనూష,హైమావతి సీసీలు నజీర్,రవి,సావిత్రి, అకౌంటెంట్ రాజు, ఆపరేటర్ రవి తదితరులు పాల్గొన్నారు.