20 July, 2026 | 8:40 PM

ప్రైవేట్ వర్సిటీల లక్ష్యాలేంటి?

20-07-2026 02:19 AM
  1. నిబంధనలు పాటిస్తున్నాయా?
  2. రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించిన సుప్రీంకోర్టు
  3. కోర్టు ఆదేశాలతో కదిలిన తెలంగాణ సర్కార్
  4. ప్రత్యేక కమిటీతో యూనివర్సిటీల్లో తనిఖీలు 
  5. అఫిడవిట్ సమర్పించనున్న రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): పెద్ద సంఖ్యలో ఏర్పాటవుతున్న ప్రైవేట్ యూనివర్సిటీల వెనుక ఉన్న అసలు ఉద్దేశాలు, వాటిని ఏర్పాటు చేస్తు న్న సంస్థలు, వ్యక్తుల లక్ష్యాలు ఏమిటి? ఆ యూనివర్సిటీల్లో బోధిస్తున్న అధ్యాపకుల విద్యార్హతలు ఏమిటి? అనే దానిపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది.

అయేషా జైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు విచారణలో తన దృష్టికి వచ్చిన అనేక ఫిర్యాదులను పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం.. దేశవ్యాప్తంగా ప్రైవేట్ యూనివర్సిటీల్లో తనిఖీలకు ఆదేశించింది. యూనివర్సిటీల ఏర్పాటు  ఉద్దేశాలు మొద లు విద్యా ప్రమాణాల వరకు ప్రతి అంశాన్ని క్షుణ్నంగా తనిఖీ చేసి పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. 

సీసీఈ అధ్యక్షతన ప్రత్యేక కమిటీ

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభు త్వం ప్రైవేట్ యూనివర్సిటీల్లో తనిఖీల కో సం కాలేజీయేట్ ఎడ్యుకేషన్ ఛైర్మన్(సీసీఈ) అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీలో కన్వీనర్‌గా తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యదర్శి, సభ్య కన్వీనర్గా జే ఎన్టీయూ  రిజిస్ట్రార్, సభ్యులుగా పాలమూ రు యూనివర్సిటీ రిజిస్ట్రార్, ఉస్మాని యా యూనివర్సిటీ చీఫ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ విద్యా కమిషనర్ అసిస్టెంట్ డైరెక్టర్‌ను నియమించింది. ఈ కమిటీ రాష్ట్రంలోని ప్రతి ప్రైవేట్ యూనివర్సిటీలో తనిఖీలు చేస్తుంది.  

సుప్రీంకోర్టు వివరణ కోరిన తొమ్మిది అంశాలు  

* యూనివర్సిటీ ఎందుకు ఏర్పాటు చేశారు. దాని ఏర్పాటుకు కారణాలు, ఉద్దేశాలు ఏమిటి?  యూనివర్సిటీ ఏర్పాటుకు ముందు సాధ్యాసాధ్యాలపై అధ్య యనం చేశారా?  స్థాపనకు ముందు ఏమైనా విధానపరమైన పరిశీలన (పాలసీ కన్సిడరేషన్) చేశారా,  లేదా? 

* యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఏమై నా భూ కేటాయింపు చేసిందా?  యూనివర్సిటీకి కల్పించిన ఇతర ప్రయోజ నాలు.. అందుకు విధించిన నిబంధనలు, షరతులు ఏమిటి? 

* వర్సిటీని వాస్తవంగా నిర్వహిస్తున్న సొసై టీ, సంస్థ, వ్యక్తి  ధ్యేయం ఏమిటి?. వర్సిటీ మేనేజ్‌మెంట్ కమిటీలో ఉన్న సభ్యులు ఎవరు? ఆ సభ్యులను ఎలా ఎంపిక చేశారు. యూనివర్సిటీని వాస్తవంగా నిర్వహిస్తున్న వ్యక్తి, మేనేజ్మెంట్ కమిటీలో సభ్యుల సమగ్ర వివరాలు.

* విద్యార్థులు యూనివర్సిటీలో చేరడానికి ఏ విధానం  అవలంభిస్తున్నారు. ఎంట్రెన్స్‌కు సంబంధించిన ప్రమాణాలు, నిబం ధనలు, ఆ నిబంధనలు చట్టానికి అనుగుణంగా న్నాయా లేదా?, ఎంట్రెన్స్‌కు విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించించి ధ్రువీకరించిందా? 

* బోధనా సిబ్బందిని (అకడమిక్ స్టాఫ్) వర్సిటీ ఎలా నియమించింది. వారి ఎంపికను ఏ కమిటీ చేపట్టింది. సిబ్బంది నియామకం యూజీసీ (UGC) నిబంధనలకు లోబడే చేపట్టారా? నియామక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ధ్రువీకరించిందా?

* రాష్ట్రంలో ఇతర విద్యా సంస్థలు, యూనివర్సిటీలకు విధించిన నిబంధనలు, షర తులను ఈ యూనివర్సిటీలు కచ్చితంగా పాటిస్తున్నాయని నిర్ధరించడానికి ప్రభు త్వం తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేసిం దా?  చేస్తే ఆ బృందం తనిఖీలు (ఇన్స్పెక్షన్లు) నిర్వహిస్తుందా?  తరచూ తనిఖీలు చేస్తున్నాందా? నిబంధనల అమలును తనిఖీ బృందం పర్యవేక్షిస్తుందా? ఏవైనా నిబంధనల ఉల్లంఘనలను గుర్తించారా?  నిబంధనలు ఉల్లంఘిస్తే ఏమైనా చర్యలు తీసుకున్నారా? ప్రభుత్వం తరఫు నుంచి ఏవైనా మినహాయింపులు ఇచ్చారా? 

* ’లాభాపేక్ష లేని, నష్టం లేని’ (నో ప్రాఫి ట్, నో లాస్) ప్రాతిపదికన పని చేస్తున్నామని ప్రకటించుకున్న యూనివర్సిటీలు నిజంగా అలానే పని చేస్తున్నాయా? ప్ర భుత్వం దానిని ఏ అధికారంతో అనుమతించింది. యూనివర్సిటీ ఏర్పాటు చేసిన వారు, ఆయన కుటుంబ సభ్యులకు చెల్లించే వేతనాలు, ఇతర ఖర్చులు, సం పాదించిన ఆస్తులతో సహా ఇతర అంశాలకు యూనివర్సిటీల నిధులు మళ్లించలే దని ఎలా నిర్ధారించారు? 

ఆయా యూ నివర్సిటీల ఖాతాలను ఖాతాలను ఆడిట్ చేశారా?  నిధుల మళ్లింపుపై ఏవైనా పరిశీలన చేశారా?  యూనివర్సిటీ ఏర్పాటు చేసిన వ్యక్తి, ఆయన కుటుంబ సభ్యులకు చేసిన చెల్లింపులను నిశితంగా పరిశీలించారా?  యూనివర్సిటీ ఏర్పాటు చేసిన వారు, ఆయన కుటుంబ సభ్యులు సం పాదించిన ఆస్తులను పరిశీలించారా?  నిబంధనల ఉల్లంఘనలను గుర్తించారా?  గుర్తిస్తే తీసుకున్న చర్యలు ఏమిటి? 

* విద్యార్థులతో పాటు బోధనా సిబ్బంది ఫిర్యాదుల పరిష్కారానికి ఏదైనా వ్యవస్థ సదరు యూనివర్సిటీలో ఉందా? ఉంటే అవి పని చేస్తున్నాయా?  ఫిర్యాదుల పరిష్కార కమిటీల కూర్పు ఎలా ఉంది. అప్పీలేట్ చేసుకునే అవకాశం ఉందా? ఇప్పటి వకు ఏవైనా ఫిర్యాదులు అందా యా? అందితే  వాటిని పరిష్కరించారా.?

* యూనివర్సిటీలు చట్టప్రకారం నిర్దేశించిన కనీస వేతనాలను అకడమిక్ స్టాఫ్కు చెల్లిస్తున్నాయా? యూజీసీ నిబంధనల అమలును ధ్రువీకరించారా?  సిబ్బంది వేతనాల రికార్డులను పరిశీలించారా?  ఈ క్రమంలో ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘన గుర్తించారా?  

ఇతర అంశాలు కూడా..

యూనివర్సిటీల్లో  తనిఖీ చేసిన కమిటీ.. ఆ వివరాలతో సమగ్ర అఫిడవిట్ రూపొందిస్తోంది. అఫిడవిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించనుంది. అఫిడవిట్ సమర్పణ అనంతరం సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తదుపరి కార్యాచరణ చేపట్టనుంది.  అలాగే తనిఖీ బృందం తొమ్మిది అంశాలతో పాటు సంబంధిత ఇతర అంశాలను కూడా పరిశీలించి నివేదిక రూపొందించనుంది.