20 July, 2026 | 8:29 PM

విద్యా జిహాద్ విస్తరిస్తుందా?

20-07-2026 01:58 AM
  1. దేశ వ్యాప్తంగా వెలుగులోకి  పలు ఘటనలు
  2. సైదాబాద్ ‘సక్సెస్ స్కూల్’ ఉదంతంతో మతపరమైన బోధనపై ప్రశ్నలు  
  3. హోంవర్క్‌లో ‘కల్మా, సూరా ఆల్ -ఫాతిహా’ ఆరోపణలు
  4. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

హైదరాబాద్, జూలై 1౯ (విజయక్రాంతి): సైదాబాద్‌లోని ‘సక్సెస్ స్కూల్’ ఘటన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. హిందూ విద్యార్థికి ఇచ్చిన హోంవర్క్‌లో ‘కల్మా’ను కాపీ చేయమని, ‘సూరా అ ల్-ఫాతిహా’ నేర్చుకోమని పాఠశాల యాజమాన్యం ఆదేశించిందన్న ఫిర్యాదుపై మరో సారి చర్చ మొదలైంది.

గతంలో కాన్పూర్‌లో వెలుగుచూసిన ఇటువంటి ఘటనలు, తీవ్రవాద నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో అసోం ప్రభుత్వం కొన్ని మదర్సాలపై చర్యలు తీసుకోవడం.. మతపరమైన బోధనపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనలతో కొందరు ఆందోళన చెందుతుండగా, బద్నాం చేయడానికి ప్రయత్నిస్తు న్నారని మరికొందరు భావిస్తున్నారు.  

ఎఫ్‌ఐఆర్ నమోదు

 సక్సెస్ స్కూల్‌లో హిందూ మతానికి చెందిన ఆరేళ్ల విద్యార్థికి ఇస్లామిక్ మతపరమైన పద్ధతులను హోంవర్క్‌గా ఇచ్చారనే ఆ రోపణలపై ఉపాధ్యాయునితో పాటు ఇతరులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బాధిత చిన్నారి మేనత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ‘భారతీయ న్యాయ సంహిత’ (బీఎన్‌ఎస్)లోని సెక్షన్ 299, మరియు ‘జువెనైల్ జస్టిస్ యాక్ట్’ లోని సెక్షన్ 75 కింద ఈ కేసును నమోదు చేశారు.

ఈ హోంవర్క్ కేటాయింపు తమ పాఠశాల విధానాలకు విరుద్ధమని పేర్కొంటూ యాజమాన్యం సద రు ఉపాధ్యాయుడిని తొలగించింది.  ఈ ఘటనపై బీజేపీ, వీహెచ్‌పీ (విశ్వహిందూ పరిషత్)లు నిరసనలు చేపట్టాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయగా.. విద్యాసంస్థ గుర్తింపును రద్దు చేయాలని వీహెచ్‌పీ నేతలు కోరారు.

దేశంలో వెలుగుచూసిన ఘటనల్లో కొన్ని..  

2026 హైదరాబాద్ :  సైదాబాద్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 2వ తరగతి హిం దూ విద్యార్థికి ఇస్లామిక్ కల్మా, సూరా ఫాతిహా చదవాలని టీచర్ హోంవ ర్క్ ఇచ్చారు. ఇది పొరపాటుగా జరిగిందని పేర్కొన్న యా జమాన్యం సదరు ఉపాధ్యాయుడి ని తొలగించింది. విద్యాశాఖ అధికారులు, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

2022  కాన్పూర్ : ఉత్తరప్రదేశ్‌లోని ఫ్లోరె ట్స్ ఇంటర్నేషనల్ స్కూలులో ఉదయం ని ర్వహించే అసెంబ్లీలో పిల్లలతో కల్మా చదివిస్తున్నారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మతసామరస్యం కోసం అన్ని మతాల ప్రార్థనలు నిర్వహిస్తున్నామని యాజమాన్యం చె ప్పింది. తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడం తో తర్వాత ఇస్లామిక్ ప్రార్థనను ఆపేసింది.

2021 బీదర్ : పౌరసత్వ సవరణ చట్టా న్ని (సీఏఏ) విమర్శిస్తూ నాటకం వేసినందుకు ఒక ప్రైవేట్ పాఠశాల వివాదంలో చి క్కుకుంది. ఇది మతపరమైన ప్రార్థనలకు సంబంధించింది కాకపోయినప్పటికీ, పాఠశాలల్లో రాజకీయ, మతపరమైన ప్రేరేపణల ఆరోపణలతో పెద్ద వివాదంగా మారింది.

2022  కర్ణాటక : హిజాబ్ ధరించడంపై పలు పాఠశాలల్లో వివాదాలు రేగాయి. ఇది నిర్బంధ ప్రార్థనలకు సంబంధించినది కాకపోయినప్పటికీ, విద్యాసంస్థల్లో మతపరమై న వ్యక్తీకరణలపై విస్తృత చర్చకు దారితీసింది.

అసోం ఉదంతం :  ప్రభుత్వ నిధులతో నడుస్తున్న 600కు పైగా మదర్సాలను సాధారణ పాఠశాలలుగా మార్చింది. అదే సూత్రాన్ని వర్తింపజేస్తూ ‘సంస్కృత టోల్స్’ (సాంప్రదాయ సంస్కృత పాఠశాలలు) కు కూ డా రాష్ట్ర ప్రభుత్వం నిధులను నిలిపివేసింది. ప్రైవేట్‌గా నడిచే మదర్సాలు మాత్రం నిబంధనలకు లోబడి తమ కార్యకలాపాలను కొ నసాగించవచ్చని   స్పష్టం చేసింది. ‘విద్యా జిహాద్‘ వాదనను సమర్థించే వారు అస్సాం లో జరిగిన పరిణామాలను కూడా ప్రస్తావిస్తున్నారు.

2022 ప్రారంభం నుంచి అన్సారుల్లా బంగ్లా టీమ్ (ఏబీటీ), ఇండియన్ సబ్‌కాంటినెంట్ అల్-ఖైదా (ఏక్యూఐ ఎస్) వంటి తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే పోలీసుల ఆరోపణల నేపథ్యంలో అసోం ప్రభుత్వం కొన్ని ప్రైవేట్ మదర్సాలపై చర్యలు తీసుకుంది. పలువురు మత గురువులను అరెస్టు చేయగా, అక్రమ నిర్మాణాలు మరియు జాతీయ భద్రతా కారణాలను చూ పుతూ కొన్ని మదర్సాలను కూల్చివేశారు.

ప్రభుత్వ నిధులతో ఏ మత బోధనలనూ ప్రోత్సహించకూడదనేది ప్రభు త్వ స్పష్టమైన విధానం. అదేవిధంగా హైదరాబాద్ స్కూల్ లో జరిగిన సంఘటన కూ డా ఒక ఉపాధ్యాయుడి పొరపాటుగానే అభివర్ణించింది తప్ప, సంస్థాగత విధానం కాదని స్పష్టం చేసింది. దేశంలో దాదాపు 15 లక్షలకుపైగా విద్యా సంస్థల్లో సుమారు 25 కోట్ల కు పైగా విద్యార్థులకు విద్యాబోధన జరుగుతోంది.

ఈ నేప థ్యంలో నిర్బంధంగా మత బోధన జరుగుతుందనే ఆరోపణలకు సం బంధించి.. నిర్దిష్టమైన కేసుల సంఖ్య పోల్చదగిన స్థాయిలో లేదనే చెప్పవచ్చు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, వాటిపై తలెత్తుతున్న వివాదాలకు సరైన ఆధారాలు లేవనే తేలుతోంది.  

రాజ్యాంగ చట్రం.. సమతుల్యత

భారత రాజ్యాంగం ఇటువంటి వివాదాలను పరిష్కరించడానికి ఒక అద్భుతమైన చట్రాన్ని అందిస్తోంది. రా జ్యాంగంలోని ఆర్టికల్ 28 ప్రకారం ప్రభుత్వ నిధులతో పూర్తిగా నడిచే వి ద్యాసంస్థల్లో ఎలాంటి మత బోధనలు చేయడాన్ని నిషేధిస్తుంది. అయితే, మై నారిటీలు లేదా నిర్దిష్ట ట్రస్టుల ద్వారా స్థాపించబడిన సంస్థలకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అదే సమయం లో, రాజ్యాంగం కల్పించిన అంతఃకరణ స్వేచ్ఛ, మత స్వేచ్ఛ మరియు మైనారిటీలు విద్యాసంస్థలను స్థాపించుకునే హక్కులు కూడా అంతే ముఖ్యమైనవి.