20 July, 2026 | 8:30 PM

వానదేవుడికి గిరిజనుల పూజలు

20-07-2026 01:48 AM

అడవిలో గజ్జల దేవుడికి మొక్కులు

ఉట్నూర్, జూలై 19 (విజయక్రాంతి): వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవ డంతో ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని ఇంద్రవెల్లి, సిరికొండ మండలాల పరిధిలో 44 గ్రామాలకు చెందిన ఆదివాసీ గోండు గిరిజనులు ఆదివారం వానదేవుడికి పూజ లు చేశారు. వాడ్‌గగావ్, వాల్గొండ హీరపూర్ రెవెన్యూ గ్రామాల శివారులో తమ ఆరాధ్య దైవం గజ్జల దేవుడికి వద్దకు వెళ్లి వర్షం కురిపించాలని మొక్కులు చెల్లించుకున్నారు. మంచివర్షాలు కురిపిస్తే మరోసారి మొక్కులు తీర్చుకుంటామని ప్రార్థించారు.