20 July, 2026 | 4:11 AM

బాధిత కుటుంబానికి సర్పంచుల ఆర్థిక చేయూత

19-07-2026 05:10 PM

ఆర్థిక సహాయం అందిస్తున్న సర్పంచులు సుమలత, వసంతరావు

గుండాల, (విజయక్రాంతి): మండల పరిధిలోని రేగులగూడెం గ్రామానికి చెందిన వృద్ధురాలు గుగులోత్ అచ్చి కుటుంబానికి శంభునిగూడెం మరియు చెట్టుపల్లి గ్రామపంచాయతీల సర్పంచులు ఈసం సుమలత, ఢిల్లీ వసంతరావు, నాయకుల సమిష్టితో ఆదివారం 8500 ఆర్ధిక సహాయం అందించి తమ ఉదారతను చాటుకున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన గుగులోత్ అచ్చి ఆకస్మికంగా మరణించడంతో ఆ కుటుంబానికి చేయూత నందించాలనే లక్ష్యంతో పార్టీ నాయకులు, సర్పంచుల సమిష్టితో దశదిన కర్మలకు ఆర్ధిక సహాయం అందించడం జరిగిందని వారు అన్నారు. ఇప్పటికే చాలా కుటుంబాలకు శంభునిగూడెం ,చెట్టుపల్లి గ్రామపంచాయతీల సర్పంచులు, వార్డ్ మెంబర్స్, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు.

కార్యకర్తలకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. ఈ రెండు గ్రామపంచాయతీలలో ఓటర్లకు ఎవరికైనా ఏ సమస్య వచ్చినా గ్రామపంచాయతీల సమిష్టితో మా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని, ఓటర్లను కంటికి రెప్పలాగా కాపాడుకోవడమే మా బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పొంబోయిన ముత్తయ్య, ఈసం రాజబాబు, ఈసం వెంకన్న, ఈసం ప్రభాకర్, కల్తి వసంతరావు, పొడుగు కృష్ణ, వాంకుడోత్ నరేష్, బొర్రా ప్రసాద్,  బొర్రా వీరస్వామి, కల్తి సురేష్, పూనెం వెంకన్న, వాంకుడోత్ రమేష్, పొడుగు రవి, ఈసం భాస్కర్, సమ్మయ్య, మంగిలాల్ తదితరులు పాల్గొన్నారు.