20 July, 2026 | 9:40 PM

‘నేను సైతం 2.0’కు విశేష స్పందన

20-07-2026 02:43 AM
  1. 16 సీసీ టీవీ కెమెరాలు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసిన రమణంద కాలనీ వాసులు
  2. నేర నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని పోలీసుల పిలుపు

నాగోల్, జూలై 19 (విజయక్రాంతి): మ ల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసింగ్ను బలోపేతం చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న ‘నేను సైతం 2.0‘ కార్యక్రమంలో భాగంగా నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రమణంద కాలనీలో 16 సీసీటీవీ కెమెరాలను ప్రారంభించారు. కాల నీ వాసులు స్వచ్ఛందంగా తమ సొంత నిధులతో ఈ కెమెరాలను ఏర్పాటు చేయడం విశేషం. నాగోల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ సీసీటీవీ కెమెరాలను ప్రారంభించి మాట్లాడారు.

సీసీటీవీ నిఘా వ్యవస్థ నేరాల నివారణతో పాటు నేరాల ఛేదనలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రతి కాలనీ, అపార్ట్మెంట్, వాణిజ్య సముదాయాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పా టు చేసుకోవడం ద్వారా ప్రజల భద్రత మ రింత మెరుగుపడుతుందని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో పోలీసింగ్ వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారుతుందని పేర్కొం టూ, ఈ కార్యక్రమానికి సహకరించిన రమణంద కాలనీ వాసులను ఇన్స్పెక్టర్ అభినం దించారు. ఈ కార్యక్రమంలో సెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ బి. ఉమ, రమణంద కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.ఎస్.ఆర్.ఏ. ప్రసా ద్, ప్రధాన కార్యదర్శి డి.ఎస్.ఆర్. మూర్తి, కోశాధికారి హనుమంతరావు, కాలనీ ప్రతినిధులు, నివాసులు పాల్గొన్నారు.