27 June, 2026 | 7:47 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

రైతు భరోసా సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

22-04-2026 01:09 AM

రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక కృతజ్ఞతలు

మంథ ఏప్రిల్ 21 (విజయ క్రాంతి) భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తురుపల్లి గ్రామంలో నిర్వహించిన రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమానికి భారీగా హాజరై, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల, ఇతర జిల్లాల ప్రజలకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీపై ప్రజలు చూపిస్తున్న విశ్వాసం తమకు మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు.అలాగే మంథని నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, మహిళా సోదరమణులు, యూత్ కాంగ్రెస్ సోదరులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన జిల్లా అధికారులకు, సిబ్బందికి పోలీస్ శాఖ సిబ్బందికి, డీఎస్ బి వాలంటీర్స్ కు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.వారి సమన్వయం, క్రమశిక్షణ వల్ల కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యిందని అభినందించారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరి పాత్ర అభినందనీయమని మంత్రి అన్నారు. ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.