22 April, 2026 | 2:43 AM

ప్రత్యేక సమగ్ర సవరణ త్వరగా పూర్తి చేయాలి

22-04-2026 01:10 AM

కలెక్టర్ హరిత

కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): ప్రత్యేక సమగ్ర సవరణ మ్యాపింగ్ ప్రక్రియ జిల్లాలో 2 వారాలలో పూర్తి చేయాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి లతో కలిసి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల పరిధిలోని అన్ని మండలాల తహసిల్దారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, సెర్ప్ ఎపిఎంలు, విఓఎలు, సూపర్వైజర్లతో మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ ప్రక్రియను వేగంగా చేయడంలో పంచాయతీ కార్యదర్శు లు, స్వయం సహాయక సంఘాల మహిళలు, విఓఎలు, సూపర్వైజర్లు సమన్వయంతో పనిచేసే మ్యాపింగ్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేయాలని తెలిపారు. ప్రతిరోజు మాపింగ్ ప్రక్రియపై పురోగతి పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఉపాది హామీ పనికి వచ్చే కూలీలు ఎండ తీవ్రత పట్లా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ హరిత అన్నారు.

మంగళవారం కాగజ్ నగర్ మంగలంలోని చింతగూడ గ్రామ శివారులో నిర్వహి స్తున్న ఉపాది హామీ పని ప్రదేశాన్ని స్థానిక మండల ప్రజా పరిషత్ అధికారి, ఈజిఎస్, ఎపి ఓతో కలిసి కలెక్టర్ హరిత పరిశీలించారు. గత వారం నుండి రోజు రోజు ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయని వేడి గాలుల పట్ల ప్రజలు జాగ్రత్తగా వుండాలన్నారు. అనంతరం ఉపాధి కూలీలకు కలెక్టర్ ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అలాగే పరిశ్రమలలో ప్రమాదాలు జరుగకుండా పరిశ్రమల యజమనులు రక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరిత అన్నారు.

మంగళవారం కాగజ్ నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ పరిశ్రమను ప్రజపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమములో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పరిశ్రమల రక్షణ పై ఏర్పాటు చేసిన మాక్ డ్రిల్ కార్యక్రమము లో నిజామాబాద్ డిప్యూటి చీఫ్ ఇన్స్పెక్టర్ సి హెచ్ లక్ష్మి కుమారి ఎస్‌పిఎం వైస్ ప్రెసిడెంట్ ఎకే మిశ్రాతో కలిసి కలెక్టర్ హరిత పాల్గొన్నారు. అనంతరం కాగజ్ నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయములో జనాభ గణన ప్రక్రియలో భాగంగా ఇళ్ల గణన కార్యక్రమములో విధులు నిర్వహించే ఎన్యూమరేటర్లు, సూపెర్ వైజర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హరిత పాల్గొన్నారు.