జోక్యం చేసుకోవాలి
- గ్యాస్ కొరతతో తీవ్రంగా దెబ్బతింటున్న ఫుడ్ బిజినెస్
- లక్షల మంది కార్మికులు, విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు
- బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి
- కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి పూరీకి బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ లేఖ
హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): వాణిజ్య, గృహ అవసరాల ఎల్పీజీ గ్యా స్ సిలిండర్ల తీవ్ర కొరతపై కేం ద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర పెట్రోలి యం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు గురువారం కేంద్ర మంత్రికి లేఖ రాశారు.
ప్రస్తు తం ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన తీవ్ర అంతరాయం వల్ల హోటళ్లు, తినుబండారాల కేంద్రాలు, పీజీ హాస్టళ్లు, చిన్న చిన్న ఆహార వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. వెంటనే సరఫరా పునరుద్ధరించకపోతే వేలాది వ్యాపార సంస్థలు మూతపడే ప్రమాదం ఉంద ని, లక్షల మంది కార్మికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ స్తుందని ఆందోళన వ్యక్తంచేశారు.
ఈ సంక్షోభాన్ని పరి ష్కరించేందు కు కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి పలు ఆచరణాత్మక సూచ నలు చేశారు. ముఖ్యంగా చిన్న వ్యాపారులను రక్షించేలా స్థాయిలవారీ ఎల్పీజీ కేటాయింపు వ్యవస్థను ప్రవేశ పెట్టాలని సూచించారు. ఎల్పీజీ సిలిండర్ల లభ్యతపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అం దించేలా రియల్ టైమ్ పబ్లిక్ డ్యాష్‌బోర్డ్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో వాణిజ్య సిలిండర్ల ధరలను పెంచకుండా తాత్కాలిక ధరల స్థిరీకరణ చేయాలని అభ్యర్థించారు.
అదనంగా గృహ సిలిండర్లను అక్రమంగా వాణిజ్య అవసరాలకు మళ్లిస్తూ జరుగుతున్న బ్లాక్ మార్కె టింగ్‌ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఐటీ కారిడార్ ప్రాంతా ల్లో నివసిస్తున్న లక్షల మంది విద్యార్థులు, ఉద్యోగులు ఆధారపడే పీజీ హాస్టళ్లకు ప్రత్యేక రక్షణ క్యాటగిరీ కింద గ్యాస్ సరఫరా చేయాలని సూచించారు. గ్యాస్ ఆధారిత శ్మశాన వాటికల్లో కార్యకలాపాలు నిలిచిపోకుండా ఉండేందుకు వాటిని అత్యవసర సేవలుగా గుర్తించి ప్రాధాన్య కేటాయింపు ఇవ్వాలని కూడా పేర్కొన్నారు.
హోటల్, ఆహార రంగం పై ఆధారపడిన లక్షల మంది దినసరి కార్మికుల జీవనోపాధి ప్రమాదంలో పడకుండా కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరా రు. ప్రస్తుతం నెలకొన్న ఈ పరిస్థితి సాధారణ సమస్య కాదని, ఇది లక్షల మంది ప్రజ ల జీవనోపాధిని ప్రభావితం చేసే సంక్షోభమని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం వెంటనే సమన్వయంతో చర్యలు చేపట్టి ఎల్పీ జీ సరఫరాను పునరుద్ధరించాలని విజ్ఞప్తిచేశారు.




