సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా మురళి మోహన్ గౌడ్
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని ఆయా గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో నాగిరెడ్డిపేట్ మండల సర్పంచుల ఫోరం ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులుగా చినుర్ గ్రామ సర్పంచ్ మురళి మోహన్ గౌడ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయా గ్రామాల సర్పంచులు తెలిపారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచుల ఫోరం అధ్యక్షులు మురళీ మోహన్ గౌడ్ మాట్లాడుతూ... తనపై ఎంతో నమ్మకముతో మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులుగా సక్రమంగా పనిచేస్తానని, రానున్న ప్రతి సమస్యపై పోరాడి కృషి చేస్తానన్నారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచులు శాలువతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు వంశీకృష్ణ గౌడ్, మన్నె వెంకట్, మహేందర్, భాస్కర్, బాల్య నాయక్, సాయిలు, సురేష్, ప్రభు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, పుప్పాల సాయిలు, యాద గౌడ్, వెంకట్ గౌడ్, సంజీవరావు, అనిత, భాగ్య, పద్మ, గంగమణి, లక్ష్మి, సునంద, రోజా, వర్షిని, ఉమ్మన్నగారి లక్ష్మి,అనిత, ధనావత్ పార్వతి తదితరులు పాల్గొన్నారు.




