27 June, 2026 | 3:00 PM

కరీంనగర్ పట్టణాన్ని ప్లాస్టిక్ నుండి కాపాడాలి

27-06-2026 02:09 PM

ప్రజా మిత్ర రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్

ముకరంపుర, జూన్ 27(విజయక్రాంతి):  కరీంనగర్ పట్టణంలోని పెద్ద డ్రైనేజీలు అన్ని కూడా ప్లాస్టిక్ వ్యర్ధాలతో నిండిపోయి ఉన్నాయని దీనివలన వర్షం నీరు రోడ్లపై ప్రవహించి వరదగా మారుతుందన్నారు. కనుక కరీంనగర్ పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చి నగరాన్ని కాపాడాలని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు.

శనివారం ప్రజామిత్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల లోపల ఈ మార్పు రావాలంటే అన్ని మతాల పెద్దలు, అన్ని రాజకీయ పార్టీలు, వివిధ పౌర సంఘాల నాయకులు,కార్పొరేటర్లు నగరపాలక అధికారులు, ప్రతి ఒక్కరూ సమిష్టిగా ప్లాస్టిక్ నిర్మూలన కృషి చేయాలి అన్నారు.కరీంనగర్ పట్టణంలో గ్రీనరీ తక్కువగా ఉన్నది కనుక ఒక లక్ష మొక్కలు నాటి వాటిని నగరపాలక  సంస్థ, ప్రజలు కలిసి కాపాడాలన్నారు. కొత్తగా ఎన్నికైన మేయర్, కార్పొరేటర్లు అందరూ ఈ దిశలో ఆలోచించి పని చేయాలన్నారు. ఈ మీడియా సమావేశంలో చిగిరి శ్రీధర్,  తదితరులు పాల్గొన్నారు.