27 June, 2026 | 4:38 PM

ఎస్ఐఆర్‌పై అవగాహన సదస్సు

27-06-2026 03:21 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్య గార్డెన్స్‌లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్)పై విస్తృత అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు శనివారం తెలిపారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరవుతారని వెల్లడించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ బి. ఎల్ ఏ లు , సర్పంచులు, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరై ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. ఈ సదస్సు ద్వారా ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, మార్పులు, సవరణలపై పార్టీ శ్రేణులకు స్పష్టత కల్పించనున్నట్లు తెలిపారు.