ముగ్గురు సీఎంల సీక్రెట్ అగ్రిమెంట్ ఏంటి?
3 రాష్ట్రాల సీఎంలు రహస్యంగా ఏం చర్చించారు?
హైదరాబాద్: తుంగభద్ర కొత్త గేట్లు(Tungabhadra) ప్రారంభానికి ముందు మూడు రాష్ట్రాల ముగ్గురు ముఖ్యమంత్రుల మీటింగులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని(Minister Uttam Kumar Reddy) బైట కూర్చోబెట్టి రహస్యంగా ఏం చర్చించారో ఆ వివరాలు ప్రజల ముందు పెట్టాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. 55 టీఎంసీల నిల్వతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రెండు ప్రాజెక్టులకు రూపకల్పన చేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ భవన్(Telangana Bhavan)లో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. బ్రిజేశ్ కుమార్ ట్రిబినల్(Brijesh Kumar Tribunal) ముందు వాదనలు జరిగాయని చెప్పారు.
మీటింగ్ లో ముగ్గురే సీఎంలు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్(Union Minister for Jal Shakti C.R. Patil) ఉన్నారని వెల్లడించారు. మీరు చేసిన సీక్రెట్ అగ్రిమెంట్ ఏంటి? 3 రాష్ట్రాల సీఎంలు రహస్యంగా ఏం చర్చించారు?. కర్ణాటక ప్రాజెక్టులకు సీఎం ఎందుకు అభ్యంతరం తెలపలేదు? అని మాజీ మంత్రి హరీశ్ రావు అని ప్రశ్నించారు. ఏ అగ్రిమెంట్ చేశారో తెలంగాణ ప్రజలకు తెలియాల్సి ఉందన్నారు. మూడు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగిందన్నారు. ఏం ఒప్పందం జరిగింది? అని ప్రశ్నించారు. కర్ణాటక ప్రభుత్వం తెలంగాణకు లేఖ రాసింది. కర్ణాటక రాసిన సీక్రెట్ ఒప్పందం ఏంటి? మూడు రాష్ట్రాల సీఎంలతో జరిగిన చర్చలు బయటపెట్టాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. పోరాడి.. తెలంగాణను సాధించిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు.
బీఆర్ఎస్ హయాంలో గుండ్రేవుల ప్రాజెక్టును వ్యతిరేకించాం
గుండ్రేవుల దగ్గర ఏపీ 20 టీఎంసీల రిజర్వాయర్ నిర్మాణం చేయనుందని హరీశ్ రావు వెల్లడించారు. ఆర్డీఎస్ ఎగువన 35 టీఎంసీలతో నవేలీ రిజర్వాయర్ ను నిర్మించేందుకు కర్నాటక సిద్ధమవుతోందని తెలిపారు. తుంగభద్ర మీద గుండ్రేవుల దగ్గర రిజర్వాయర్ నిర్మించవద్దని 2013లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపు చేయబోమని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలో గుండ్రేవుల ప్రాజెక్టును వ్యతిరేకించామని సూచించారు. గుండ్రేవుల నిర్మిస్తే పాలమూరు ఎత్తిపోతలపై ప్రభావం చూపిస్తోందని హరీశ్ రావు హెచ్చరించారు.






