మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
02-05-2026 02:27 AM
ఆమనగల్లు, మే1 (విజయక్రాంతి): ఆమనగల్లు మున్సిపల్ నూతన కమిషనర్గా రాఘవేందర్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన శంకర్ నాయక్ బదిలీ కావడంతో ఆయన స్థానంలో రాఘవేందర్ రెడ్డి నియమితులయ్యారు. అంతకుముందు కమిషనర్ హైదరాబాద్లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మున్సిపాలిటీ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని కమిషనర్‌కు ఎమ్మెల్యే సూచించారు.
మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తానని కమిషనర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సిబ్బంది మరియు ప్రజల సహకారం కావాలని కోరారు.






