17 June, 2026 | 2:17 AM

పనిమనిషితో వివాహేతర సంబంధం

17-06-2026 01:06 AM

గర్భం దాల్చడంతో తనకు సంబంధం లేదన్న యజమాని

పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించిన బాధితురాలు

నారాయణ పేట (కోస్గి) జూన్ 16 : పొట్టకూటికోసం ఓ ఇంట్లో పనిమనిషిగా చేరిన యువతిని తల్లిని చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలోని ఓ జ్యువెలరీ షాప్ యజమాని సాయికృష్ణ తన ఇంట్లో పనిచేస్తున్న 20 ఏళ్ల యువతిని తల్లిని చేశాడు. సీఐ సైదులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

తనను సాయికృష్ణ మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడని, ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతినని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పంచాయితీ పెట్టిన యువతి డబ్బులు వద్దని తనను పెళ్లిచేసుకోవాలని డిమాండ్ చేసింది. సాయికృష్ణ ఒప్పుకోకపోవడంతో చేసేదిలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. డీఎన్‌ఏ పరీక్ష కోసం యువతిని నారాయణ పేట ఆసుపత్రికి తరలించారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామని సీఐ సైదులు తెలిపారు.