17 June, 2026 | 1:11 AM

5 వేల పోస్టులతో మరో మోసం

17-06-2026 12:27 AM

పోలీసు శాఖలో 20 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలి : కేటీఆర్

 హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): పోలీస్ శాఖలో 5 వేల పోస్టుల భర్తీ అంటూ ప్రభుత్వం మరో మోసానికి తెరలేపిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం ప్రకటనలో విమర్శించారు.  దిల్‌సుఖ్‌నగర్‌లో తమ న్యాయమైన డిమాండ్ల కోసం, ఉద్యోగాల భర్తీ కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగ యువతపై, పోలీస్ అభ్యర్థులపై ప్రభుత్వం పోలీసులతో లాఠీఛార్జ్ చేయించడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు.

ఎన్నికల ముందు ఒకే ఏడాది రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ’మెగా నోటిఫికేషన్లు’, ’జాబ్ క్యాలెండర్’ అంటూ నిరుద్యోగ యువతను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. నేడు నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 20 వేలకి పైగా పోలీస్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ, కేవలం 5 వేల పోస్టులతో చేతులు దులుపుకోవాలని చూడటం అన్యాయమన్నా రు.

సుదీర్ఘకా లంగా కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటూ, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 20 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న అభ్యర్థులను  అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభు త్వ అహంకారానికి నిదర్శనమని మండిపడ్డా రు. విద్యార్థులను,నిరుద్యోగులను పోలీసులతో అణగదొక్కడమే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఇందిరమ్మ ప్రజా పాలననా అని కేటీఆర్ ప్రశ్నించారు.