17 June, 2026 | 2:37 AM

ఢిల్లీ కుట్రలను తిప్పికొడతాం

17-06-2026 01:14 AM

పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్

సంగారెడ్డి, జూన్ 16 (విజయక్రాంతి): బీజేపీ ఆడించే తోలుబొమ్మలాటలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక బొమ్మలా ఆడుతున్నారని, తెలంగాణ కోసం ఆయన చేసిందేమీ లేదని పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై నియోజకవర్గ బూత్ లెవల్ శిక్షణా శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

పార్టీలో అంతర్గత క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని, కొందరు నేతలు పార్టీ అంతర్గత విషయాలను మీడియాకు, విపక్షాలకు లీక్ చేస్తూ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి లీకుల రాజకీయాన్ని అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తోంది.. ఎంతటి వారైనా సరే.. పార్టీ గీత దాటితే క్రమశిక్షణా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ పథకాలను, ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ, జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్, డీసీసీ అధ్యక్షురాలు నిర్మల,  పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు.