ట్రంప్‌పై ఎంపీ కమల్‌హాసన్ ఆగ్రహం
మీ పని మీరు చూసుకోండని వ్యాఖ్య
న్యూఢిల్లీ, మార్చి : ట్రంప్‌పై పై రాజ్యసభ ఎంపి కమల్ హాసన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రెండు సార్వభౌమాధికారం ఉన్న దేశాలు అభిప్రాయాలను పరస్పరం గౌరవించుకోవడమే ప్రపంచ శాంతికి పునాదిరాయి అన్నారు. అవతలి వారి విషయాల్లో తలదూర్చకుండా ట్రంప్ తన పని తాను చూసుకో వాలని హెచ్చరించారు. ‘ ఇండియా విషయంలో ట్రంప్ వ్యవహార శైలి తొలి నుంచి వివాదాస్పదంగానే ఉంది. ఇది వరకే భారత అంతరంగి విషయాలపై అమెరికా అధ్యక్షుడు బహిరంగ విమర్శలు చేశారు. వీటిని భారత్ పలుమార్లు ఖండించింది. అయినప్పటికీ ట్రంప్ తీరు మార్చుకోలేదు.
తాజాగా రష్యా నుంచి భారత్ నెల రోజుల పాటు చమురు కొనుగోలు చేసుకోవచ్చని దానికి అనుమతిచ్చామని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ అన్నారు. ఈ వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. తాజాగా ఈ అంశంపై రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ స్పందించారు. ఎక్స్ వేదికగా ట్రంప్‌కు లేఖ రాశారు. ‘ ప్రియమైన ప్రెసిడెంట్ భారత ప్రజలు సౌర్వభౌమ దేశానికి చెందిన వారు. మాకు వేరే దేశాల అనుమతులు అవసరం లేదు. దయచేసి మీ సామర్థ్యం మేరకు మీ పని చూసుకొండి‘ అని అన్నారు. సౌర్వభౌమ దేశాలా అభిప్రాయాలు పరస్పరం గౌరవమివ్వడమే శాంతికి మూలమని మీ దేశ ప్రజలకు శాంతి, సౌభాగ్యం లభించాలని లేఖలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:




