తరలిస్తే తంటాలు తప్పవు...
- పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపుపై పోలీసుల ఉక్కుపాదం
- వారంలో రెండు కేసులు నమోదు
- కోదాడ నుంచి జగ్గయ్యపేటకు తరలిస్తున్న 8 క్వింటాళ్ల బియ్యం పట్టివేత
- గుజరాత్ బాటలో 31 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం
- సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు నలుగురు అరెస్ట్
- నిరంతర నిఘా పెట్టామంటున్న పోలీసులు
కోదాడ, ఆగస్టు 21 : పేదల ఆకలి తీర్చాలన్న లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్న బియ్యం అందిస్తుంటే దానినే కొందరు అక్రమార్కులు ఆదాయ వనరుగా మార్చుకుం టున్నారు. దుకాణాల ద్వారా బియ్యం పంపి ణీ జరగగానే కేజీ రూ 10 నుండి 15 వరకు పెట్టి కొనుగోలు చేసి మొత్తం ఒకచోట డప్పు చేసి అక్కడి నుండి లారీలు, వివిధ వాహనాల ద్వారా అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలించి దాని ద్వారా లాభాలు పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ దందా ఓ గ్రామం నుండి మరో గ్రామానికి కాదు ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి విస్తరించిందనడం అతిశయోక్తి కాదు.
అక్రమ తరలింపుపై పోలీసుల ఉక్కు పాదం
పిడిఎస్ బియ్యం అక్రమ తరలింపు పై పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటూ సం బంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తూ వస్తున్నారు. దీంతో అక్రమ రవాణా కొంతవర కు తగ్గిందని చెప్పుకోవచ్చు. అయితే ఇ టీవల పిడిఎస్ బియ్యం ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న ముఠాలపై కోదాడ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు.
వరుస దాడులతో అక్రమ రవాణాదారులకు షాక్ ఇస్తు న్నారు. తాజాగా కోదాడ నుంచి జగ్గయ్యపేటకు తరలిస్తున్న 8 క్వింటాళ్ల పీడీఎస్ బి య్యాన్ని బుధవారం తెల్లవారుజామున దు ర్గాపురం వద్ద పట్టుకున్నారు. కారులో కదలడానికి కూడా వీలులేని విధంగా బియ్యం బ స్తాలను కుక్కి తరలిస్తుండటంతో అనుమా నం వచ్చిన పోలీసులు తనిఖీ చేసి బియ్యా న్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి తదుపరి చర్యలకు ఉపక్రమించారు.
గుజరాత్ బాట పట్టిన 31 టన్నులను
అలాగే మరో భారీ అక్రమ రవాణాను కోదాడ రూరల్ పోలీసులు ఛేదించారు. ఆంధ్రలోని లింగాల గ్రామం నుంచి ఎలాం టి అనుమతులు లేకుండా గుజరాత్కు తరలిస్తున్న 31 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని ఈ నెల 15న రాత్రి నల్లబండగూడెం శివారులోని రామాపురం క్రాస్రోడ్ చెక్పోస్ట్ వద్ద పట్టుకున్నారు. లారీలో సుమారు 600 ప్లాస్టిక్ బస్తాల్లో బియ్యం ఉన్నట్లు గుర్తించారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సివిల్ సప్లయ్ అధికారులకు అప్పగించారు.
ఈ కేసులో నలుగురు కోర్టుకు.. :
ఈ వ్యవహారంలో లారీ డ్రైవర్, క్లీనర్, లారీ యజమానితో పాటు అక్రమ రవాణాకు సహకరించిన మరో వ్యక్తిని కలిపి నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. బియ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడికి తరలిస్తున్నారు? దీని వెనుక ఎవరి హస్తం ఉంది? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
దళారులపై డేగకన్ను :
వారం రోజుల వ్యవధిలో రెండు కేసులు నమోదు కావడంతో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. దీని వెనుక ఉన్న నెట్వర్క్ను ఛేదించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బియ్యాన్ని సేకరించే వారు, రవాణా చేసే వారు, ఇతర రాష్ట్రాలకు తరలించే ముఠాల మధ్య ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది ఉండదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. వరుస పట్టివేతలతో కోదాడలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాదారుల్లో గుబులు మొదలైంది.
పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు.
పీడీఎస్ బియ్యంను అక్రమంగా తరలిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవు. ప్రజా పంపిణీ బియ్యం పక్కదారి పట్టకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నాం. కోదాడ రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కాబట్టి ఇక్కడ ప్రత్యేక నిఘా పెట్టాం. పిడిఎస్ బియ్యంను అక్రమంగా తరలిస్తే ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు.
శ్రీనివాసరెడ్డి, డీఎస్పీ కోదాడ






