నల్లాల బావికి కంచె వేసిన అధికారులు
22-08-2026 12:49 AM
రూ. 60 లక్షల భూమికి రక్షణ
రామాయంపేట, ఆగస్టు 21: ప్రజల దాహార్తి తీర్చిన బావిని కబ్జా చెరనుంచి అధికారులు కాపాడారు. విజయ్రకాంతి దినపత్రికలో కబ్జా కోరల్లో నల్లాల బావి అనే శీర్షికన ప్రచురించిన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. ఈ మేరకు గురువారం నల్లాల బావి స్థలం చుట్టూ కంచె వేశారు. కొందరు కబ్జారాయుళ్లు ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేయగా విజయక్రాంతి దినపత్రిక వెలుగులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఆ స్థలం రూ.50 నుంచి 60 లక్షల మార్కెట్ విలువ ఉండటంలో ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకున్న అక్రమార్కుల చెర నుంచి స్థలాన్ని కాపాడేందుకు బావి స్థలం చుట్టూ కంచె వేశారు.






