21 August, 2026 | 11:48 PM

మడిపల్లి హత్య కేసులో 15 మంది అరెస్ట్

21-08-2026 10:27 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో జరిగిన గుంటక రమేష్‌ హత్య కేసులో పోలీసులు 15 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్‌ వివరాలను వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 19వ తేదీన మడిపల్లి గ్రామానికి చెందిన గుంటక రమేష్‌ (43)ను అదే సామాజికవర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు దాడి చేసి హత్య చేసినట్లు తెలిపారు.

మృతుడు తరచూ తమ కుల పెద్దలను దూషిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో నిందితులు అతనిపై కక్ష పెంచుకున్నట్లు పేర్కొన్నారు. హత్యకు ముందు జరిగిన ఓ కార్యక్రమంలో రమేష్‌తో నిందితులకు గొడవ జరిగినట్లు, అనంతరం అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు.