మెరుగైన సమాజ నిర్మాణం కోసం పాటుపడదాం
జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్
మహబూబాబాద్,(విజయక్రాంతి): సమిష్టి కృషితో మెరుగైన సమాజం నిర్మాణం కోసం పాటుపడాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ పిలుపునిచ్చారు. బయ్యారం మండలం సంతులాల్‌పాడు గ్రామపంచాయతీలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ‘మన ఊరు మన బాధ్యత’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముందుగా గ్రామస్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ వినియోగం, సీసీ కెమెరాల అవసరం, వాటి ప్రయోజనాలు, మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై వీడియోల ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం గ్రామస్థులు హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, రోడ్డు ప్రమాదాలను నివారించడం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటం, గంజాయి నుంచి గ్రామాన్ని యువతను రక్షించడం వంటి అంశాలపై సామూహికంగా ప్రతిజ్ఞ చేశారు.






