స్టెమ్‌స్పార్క్ రెజొనెన్స్ స్కూల్‌లో వరలక్ష్మి వ్రత వేడుకలు
ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 21 (విజయక్రాంతి): శ్రీనగర్ కాలనీలోని స్టెమ్స్పార్క్ రెజొనెన్స్ స్కూల్లో వరలక్ష్మీ వ్రత వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి, కలశ స్థాపనతో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.
షోడశోపచారాలతో శ్రీ వరలక్ష్మీ దేవికి పూజలు చేసి, విద్యార్థినులు తొమ్మిది పోగుల తోరాలను కట్టుకున్నారు. విద్యార్థినులు ప్రదక్షిణలు, నమస్కారాలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందారు. వరలక్ష్మీ వ్రతం విశిష్టత, ప్రాధాన్యతను డైరెక్టర్ కొండా శ్రీధర్ రావు విద్యార్థులకు వివరించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేసేందుకే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
డైరెక్టర్ కొండా క్రిష్ణవేణి పూజలో పాల్గొని విద్యార్థులకు పండుగ విశిష్టతను వివరించారు. విద్యార్థుల్లో సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించేందుకు పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ కె. సురేష్ ఆధ్వర్యంలో బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వరలక్ష్మీ వ్రత వేడుకలు ఆనందోత్సాహాలతో విజయవంతంగా జరిగాయి.






