21 August, 2026 | 11:49 PM

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

21-08-2026 10:25 PM

అశ్వారావుపేట,(విజయక్రాంతి): అశ్వరావుపేట మండలం కొర్షవారిగూడెం గ్రామ  శివారులో గంజాయి సేవిస్తున్న ముగ్గురిని అశ్వరావుపేట పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా వారిని భద్రాచలంలోని ఢీ అడిక్షన్ సెంటర్కు తరలించవలసిందిగా కోర్టు సూచించింది. వీరికి గంజాయి విక్రయించిన పాపిడి గుడానికి చెందిన అల్లం వెంకటేశ్వరరావును అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు ఎస్ ఐ  రాజు తెలిపారు.