21 August, 2026 | 11:37 PM

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రవీణ్‌కు ఆర్థిక సాయం

21-08-2026 10:23 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఖమ్మంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రవీణ్‌ను ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ పరామర్శించారు. టేకులపల్లి మండలం ఎర్రాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని చింతలకట్ట గ్రామానికి చెందిన ప్రవీణ్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న కోరం సురేందర్ శుక్రవారం ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10,000 ఆర్థిక సాయం అందించి ప్రవీణ్ కుటుంబానికి అండగా నిలిచారు. ప్రవీణ్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.