22 August, 2026 | 2:35 AM

చెప్పాల్సిందంతా చెప్పా..

22-08-2026 01:14 AM
  1. సీఎం విదేశాల నుంచి రాగానే మాట్లాడతా 
  2. షోకాజ్‌పై మంత్రి కొండా సురేఖ క్లారిటీ

హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి) : ‘కాంగ్రెస్ పార్టీ జారీ చేసిన షోకాజ్ నోటీసు వ్యవహారంపై తాను చెప్పాల్సిన విషయం క్రమశిక్షణ కమిటీకి ఇప్పటికే చెప్పాను. ఇ ప్పుడు కొత్తగా చెప్పాల్సిన విషయాలేమీ లేవు. సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన నుంచి వచ్చాక అన్నీ మాట్లాడుతాను’ అని మంత్రి కొండా సురేఖ తెలిపారు. మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత చేసిన వ్యా ఖ్యల వివాదంపై శుక్రవారం ఆమె మీడియా తో మాట్లాడారు.

తాను చెప్పాల్సింది ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి రాతపూర్వకంగా తెలియజేశానని, త్వరలోనే పూర్తి వివరాలతో మీడియా ముందుకు వస్తానని ఆమె స్పష్టం చేశారు. ఈ అంశంపై ఇప్పటికప్పుడు మా ట్లాడాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపైన సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీ అధిష్టానం కూడా సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం.