4 August, 2026 | 4:58 AM

మౌళి.. దొంగ నా కొడుకు!

04-08-2026 12:35 AM

‘లిటిల్ హార్ట్స్’ చిత్రంతో ప్రశంసలు అందుకు న్న మౌళి తనూజ్ ప్రశాంత్ మరో సినిమాతో రానున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమాతో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమాకు ‘దొంగ నా కొడుకు’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు ప్రకటిస్తూ, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సైతం విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో భారీ జాక్ ప్లేయింగ్ కార్డ్ నుంచి చిరునవ్వుతో స్టైలిష్‌గా ఎంట్రీ ఇస్తున్న మౌళి లుక్ ఆకట్టుకుంటోంది.

ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే... సరదా మనస్తత్వం ఉన్న యువకుడు వరుసగా జరిగే కామెడీ, దొంగతనాల నేపథ్యంలో సాగే థ్రిల్లింగ్ సంఘటనల్లో చిక్కుకోబోతున్నాడనే ఆసక్తిని కలిగిస్తోంది. ఈ చిత్రంలో సుస్మిత శెట్టి, అలీ, రాజిత, రఘుబాబు, ప్రియ, గుండు సుధర్షన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సింజిత్ యర్రమిల్లి సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీధర్ సోంపల్లి ఎడిటర్, నాగేంద్ర గువ్వల ప్రొడక్షన్ డిజైనర్. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.