సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు
01-12-2025 12:50 AM
---జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ములుగు, నవంబరు30(విజయక్రాంతి): ములుగు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరుగుతుందని, గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరగదని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ విషయాన్ని జిల్లాలోని ప్రజలంతా గమనించి సహకరించాలని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా కొనసాగిస్తామని వెల్లడించారు.




