26 August, 2026 | 3:09 AM

సంజీవరెడ్డి భవన్‌లో ఘనంగా మహ్మద్ జావేద్ జయంతి వేడుకలు

26-08-2026 01:59 AM

ఖమ్మం, ఆగస్టు 25 (విజయక్రాంతి): జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్లో స్వర్గీయ మహ్మద్ జావేద్ 50వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సయ్యద్ గౌస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, అర్బన్ జిల్లా కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ హాజరయ్యారు.

పీసీసీ మెంబర్, ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు స్వర్గీయ మహ్మద్ జావేద్ సేవలను ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. ప్రతిపక్షం లో ఉండి అధికార పక్షానికి ఎదురెళ్లి ఎన్నో ప్రజా సమస్యలపై పోరాడిన రోజులను గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్టీఏ మెంబర్ గజ్జెల్లి వెంకన్న, రాష్ట్ర మైనారిటీ ఉపాధ్యక్షులు బీహెచ్ రబ్బానీ, షహీలా జావెద్, జిల్లా కాంగ్రెస్ అనుబంధ సంఘ అధ్యక్షులు మొక్క శేఖర్ గౌడ్, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు కిలారు అనిల్ కుమార్, ముక్రం అలీ ఖాన్, గాదెల ఝాన్సీ, జిల్లా ఓబీసీ సెల్ ఉపాధ్యక్షులు గజ్జి సూర్యనారాయణ, నగర ఓబీసీ సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్,  తదితరులు పాల్గొన్నారు.