26 August, 2026 | 4:06 AM

మధిరలో పచ్చదనం పరిమళించాలి

26-08-2026 01:58 AM

మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని సుజాత

మధిర,ఆగస్టు25(విజయ క్రాంతి): మన నేలను, గాలిని, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని మధిర మున్సిపల్ చైర్పర్సన్ సామినేని సుజాత తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటాలని, దాన్ని కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా భావితరాలకు అందించే గొప్ప కానుకగా భావించాలని కోరారు.

మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని 4వార్డ్ లో మొక్కల పంపిణీ చేసినారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... చెట్లు మన ప్రాణవాయువుకు మూలాధారమని,పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు కనీసం ఒక మొక్కనైనా నాటి,దాన్ని కంటికి రెప్పలా సంరక్షించాలని పిలుపునిచ్చారు.

పచ్చదనం పెంపొందించడంలో మధిర పట్టణాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలబెడతామని మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని సుజాత విశ్వాసం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ కె.సామ్యూల్ పాల్, వైస్ చైర్మన్ కోన ధని కుమార్, కౌన్సిలర్లు,అధికారులు, ప్రజాప్రతినిధులు,స్థానిక నాయకులు,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.