26 August, 2026 | 4:05 AM

వాసవినగర్ అభివృద్ధికి కృషి

26-08-2026 01:59 AM

మాజీ కార్పొరేటర్ శాంతి 

అల్వాల్, ఆగస్ట్ 25, (విజయక్రాంతి):  వాసవి నగర్ కాలనీ అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానని అల్వాల్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం ఆమె, అల్వాల్, డివిజన్ పరిధి లోని వాసవినగర్ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె, స్ధానికులను కలిసి సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకుని రావాలని కోరారు.

స్ధానికులు మాట్లాడుతూ కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదని, మురుగునీరు నిలిచి పరిసరాలు అపరిశుభ్రంగా మారి, దుర్గంధం వ్యాప్తి చెందుతుందని వాపో యారు. దీంతో దోమల బెడద ఎక్కువైందని  కాలనీ వాసులు తమ సమస్య లను విన్నవించారు. కాలనీలోని పార్కును సందర్శించి కావాల్సిన వసతులు అధికారులతో మాట్లాడి కల్పిస్తానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం లో కాలనీ వారు ప్రశాంత్, విక్రం, కిట్టు యాదవ్, సాయి,పద్మ నాయకులు యాదగిరి గౌడ్, లింగారెడ్డి, సాజిద్, మహేందర్ గౌడ్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.