4 May, 2026 | 10:45 PM

మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలి

04-05-2026 09:21 PM

* కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్ర అభివృద్ధి

* నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్

హనుమకొండ,(విజయక్రాంతి): మోడీ మూడోసారి పీఎం అయ్యాక మొదటిసారి తెలంగాణకు వస్తున్నారని, బహిరంగ సభను విజయవంతం చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పిలుపు నిచ్చారు. హనుమకొండ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ... ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈనెల 10న హైదరాబాద్లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొన్నాలని కోరారు. జాహిరాబాద్ లో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీ, నేషనల్ హైవే, జోగులాంబ రైల్వే స్టేషన్స్, పీఎం మిత్ర మెగా టెక్స్ టైల్ పార్క్,పెద్దపల్లి, విజయవాడ నుంచి కాజీపేట వరకు మూడో లైన్ రైలుమార్గం 1200కోట్లు తో వర్చువల్ గా ప్రారంభిస్తారని, ఈ భారీ బహిరంగ సభ కు వచ్చి కెసిఆర్, రేవంత్ రెడ్డి కూడా చూడాలనీ హితవుపలికారు.

కనీసం 4లక్షల మంది అక్కడికి వస్తారని, వరంగల్ నుంచి ఎక్కువ సంఖ్యలో రావాలని పిలుపునిచ్చారు. కోచ్ ఫ్యాక్టరీ పూర్తి కావడానికి సిద్ధంగా ఉందని, భూమి ఇస్తే ఎయిర్పోర్టును కూడా  ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని,జాగా ఇచ్చేందుకు దశబ్దం కాలం వృధా చేశారని, రీ ఆర్గనైషన్ బిల్లు ప్రకారం కేంద్రం అభివృద్ధి పనులు చేస్తుందన్నారు. తమిళనాడు లో కూడా ఎన్ డీ ఏ లేకుండా ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి లేదన్నారు. పశ్చిమ బెంగాల్ లో ఘన విజయం సాధించామని, కెసిఆర్ 72 ఏండ్లు ఉన్నారు, 100ఏండ్లు బతకాలి ఆరోగ్యంగా ఉండాలనీ,బీ ఆర్ ఎస్ పతనాన్ని కళ్ళారా.. చూడాలన్నారు.

మోడీ నాయకత్వంలో బీజేపీ బెంగాల్ లో గెలవడం, తమిళనాడు లో పొత్తుతో మొదలవుతుందనీ, ఈ గెలుపుతో తెలంగాణాలో ప్రతిపక్షాలకు వణుకు పుడుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పచ్చి అబద్దాలు చెప్తోందని,డబ్బుల్లేవ్, తెలంగాణ ఆస్తులు, భూములు అమ్ముకుంటే కానీ జీతాలు, బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. కెసిఆర్ పంగాణామాలు పెట్టాడు. రేవంత్ దానినీ కంటిన్యూ చేస్తున్నాడు అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదని,కెసిఆర్ బంద్ చేశారు, రేవంత్ రెడ్డి దానికి కొనసాగిస్తున్నాడని విమర్శించారు.రేవంత్ హాస్టల్లో విద్యార్థులకు

సన్నబియ్యం పెడుతున్నామని, ఎగిరెగిరి పెడుతున్నారు కానీ, ఎఫ్ సీ ఐ నుంచి వడ్లు కొని  80కోట్ల మందికి నెల నెల ఉచిత బియ్యం ఇచ్చేది కేంద్రం ప్రభుత్వంమే అన్నారు. ప్రభుత్వ స్కూళ్లు, దావఖానాలు అడ్వానంగా ఉన్నాయని, రోడ్లన్నీ కేంద్రం ఇచ్చే నిదులేఅన్నారు. రాజకీయం చేసేందుకే మోడీ వస్తున్నారనీ, 2028 ఎన్నికలకు పునదులు వేసేందుకే వస్తున్నారన్నారు. 2019 నుంచి తెలంగాణ నుంచి వెళ్లిన దాంట్లో రూపాయికి 87పైసలు రిటర్న్ వచ్చాయని, టిఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు.