16 July, 2026 | 12:55 AM

రైతు సంక్షేమానికి మోదీ సర్కార్ పెద్దపీట

16-07-2026 12:40 AM

ఎరువుల సబ్సిడీపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం

హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమం విషయం లో మరోసారి తన అంకితభావాన్ని చాటుకుందని, 2025 ఆర్థిక సంవత్సరానికి యూరియా సబ్సిడీ పథకాన్ని రూ.1,51,709 కోట్లతో కొనసాగిస్తూ.. ఇవాళ కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటనను విడుదల చేశా రు. ఈ నిర్ణయంతో తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది అన్నదాతలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రైతులకు 45 కిలోల యూరియా బస్తా కేవలం రూ.267కే అందుతోందని, కానీ యూరి యా బస్తా అసలు ధర రూ.1,967 అన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం బస్తాకు 1,680ల భారాన్ని సబ్సిడీగా భరిస్తోందని పేర్కొన్నారు.

అమెరికా- యుద్ధం కారణం గా ఏర్పడిన హార్మూజ్ సంక్షోభం నేపథ్యంలోనూ ఎరువుల సబ్సిడీని కొనసాగించాలని నిర్ణయించి.. 2025- సంవత్సరానికి యూరియాపై మరో రూ. 1,51,709 కోట్ల సబ్సిడీ ఇచ్చేందుకు ఆమోదముద్ర వేసిందన్నారు. మోదీ ప్రభుత్వ రైతు అనుకూల విధానాల వల్ల తెలంగాణ రైతులకు కూడా  లబ్ధి చేకూరుతోందన్నారు.

త 12 ఏళ్లలో (ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో కలిపి) తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.86,729 కోట్ల విలువైన యూరియా సబ్సిడీ అందించిందని,  యూరియా వ్యవసాయ అవసరాలకు కాకుండా ఇతర అవస రాలకోసం పక్కదారి పట్టడంతో దానిని అరికట్టడం కోసం వేపపూతతో కోటింగ్ చేయ డంతో యూరియా దారిమళ్లింపు తగ్గిందన్నారు. 2 ఎకరాలున్న ఒక రైతుకు ఏడాదికి (2 సీజన్లకు) ఒక్క యూరియా సబ్సిడీ ద్వారానే రూ.25,360 లబ్ధి చేకూరుతోందని, దీనికి అదనంగా పెట్టుబడి సహాయం గా ప్రతి రైతుకు ఏడాదికి రూ.6వేలు అదనం గా కేంద్రం సహాయం అందిస్తోందన్నారు.