16 July, 2026 | 12:50 AM

సర్దుకునే పనిలో పాలకులు!

16-07-2026 12:36 AM

జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహిస్తా: ఈటల 

మేడ్చల్, జూలై 15 (విజయక్రాంతి): ప్రజల ఆరోగ్యం, బాధలు పట్టించుకునే పాలకులు లేరని, ఎవరికి వారు సర్దుకునే పనిలో ఉన్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నా రు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వ్యతిరేక జేఏసీ నేతలు బుధవారం మేడ్చల్ మండ లం పూడూరు శివారులోని ఈటల రాజేందర్ నివాసానికి తరలివచ్చి, తమ ఉద్యమానికి నాయకత్వం వహించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ..

జవహర్ నగర్‌లోని డంపింగ్ యార్డ్ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహిస్తానని చెప్పారు. పార్టీలు జెండాలు పక్కన పెట్టి ఐక్యంగా నియమించాల్సిన అవసరం ఉందని, ప్రతి పార్టీ నుంచి పదిమందితో కమిటీ వేసుకుని, ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్దాం అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పరిష్కరించే స్థానంలో ఉన్నందున వెంటనే పరిష్కరించాలని ఈటెల డిమాండ్ చేశారు.