10 May, 2026 | 1:24 AM

మోదీ రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో కాక!

10-05-2026 12:26 AM
  1. తెలంగాణలోనూ బంగాల్ ఫలితాలే వస్తాయి
  2. బీజేపీ ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): తెలంగాణకు మోదీ రాకతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణుల్లో కాక రేపుతుందని బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. బంగాల్ ఫలితాలే తెలంగాణలోనూ పునరావృతమవు తాయని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డితో కలిసి శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హస్తిన నుంచి బీజేపీ పవనాలు గోల్కొండ కోట వరకు రెపరెపలాడే రోజు అతి దగ్గరలో ఉందన్నారు.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఇండీ కూటమికి మోదీ పనితీరుపై విమర్శించే అర్హత ఏమాత్రం లేద న్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిస్తేనే ఎంఐ ఎం అన్నారు. హిందువులను ఇబ్బందులకు గురిచేయడం వాటి టార్గెట్ అన్నారు. కాం గ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, హిందువులను కించపరిచేందుకు ఇది చాలదా? అని ప్రశ్నించారు.

అయోధ్యకు వెళ్ళడమే తప్పన్నట్టుగా రాహుల్ వ్యవహరిస్తున్నారని, రాముడిని కూడా విమ ర్శించే స్థాయికి దిగజారిపోయారని పేర్కొన్నారు. ఓట్ల కోసం హిందువులను కించపరి చేలా మాట్లాడుతున్నారని, అందుకే ఆయ న్ను రేవంతుద్దీన్ అని పిలుస్తుంటే తెగ సం బుర పడిపోతున్నాడని ఎద్దేవా చేశారు. ఆయన ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎను’ముల్ల’ రేవంత్ రెడ్డిగా మారారన్నారు.

గంగా నదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తే.. మల్లికార్జున ఖర్గే దాన్ని కూడా అవమానించేలా మాట్లాడారని, నీటిలో మునిగితే పాపా లు పోతాయా అని హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా మాట్లాడారన్నారు. అధి కారం కోసం కాంగ్రెస్ ఏ స్థాయికైనా దిగజారుతుందని, డీఎంకేను కాదని టీవీకే చెంత చేరడమే ఇందుకు నిదర్శనమన్నారు. తెలంగాణలో కూడా అధికారం కోసం బీఆర్‌ఎస్ తో జత కడుతుంది.. ఈ రెండు పార్టీలు ఒక్కటే అన్నారు. 2029 ఎన్నికల్లో బీజేపీ కా ర్యాచరణతో ముందుకు వెళ్లి అధికారంలోకి వస్తామని, తమిళనాడులో గవర్నర్ రాజ్యాంగానికి విరుద్ధంగా వెళ్లలేదని తెలిపారు.