మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు
17-07-2026 08:25 PM
సిద్దిపేట రూరల్: వనమహోత్సవం 2026 కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, రూరల్ సీఐ విద్యాసాగర్,రూరల్ ఎస్ఐ నవతతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొని మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ,ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం నాటిన మొక్కలను సంరక్షించాలని పోలీసు సిబ్బందికి సూచించారు.






