17 July, 2026 | 8:14 PM

Breaking News

గ్రామ అభివృద్ధి కమిటీ వేధింపుల వల్లే ఆత్మహత్యయత్నం   •   రూరల్ జిల్లా బిజెపి(ఓబీసీ) అధ్యక్షులు మహేందర్ యాదవ్ కు ఘన సన్మానం   •   ప్రతిభ చాటిన విద్యార్థులకు ఘన సన్మానం   •   రోడ్డు పక్కనే చెత్తగుట్టలు కథనానికి స్పందించిన అధికారులు   •   మునుగోడు నూతన ఎస్సైగా ఎం.శోభన్ బాబు బాధ్యతల స్వీకరణ   •   భూగర్భ జలాల సంరక్షణకు చర్యలు   •   మత్తు పదార్థంగా నొప్పి నివారణ టాబ్లెట్లు.. వినియోగిస్తున్న ముఠాపై కేసు   •   ఎన్క్యుఏఎస్ అంచనాకు ఆత్మకూరు ఏఏఎం కేంద్రం సిద్ధం   •   అగర్వాల్ కంపెనీలో యాక్సిడెంట్.. వివరణ కోసం తూప్రాన్ సిఐకి వినతి   •   కోటి మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం   •  

ప్రతిభ చాటిన విద్యార్థులకు ఘన సన్మానం

17-07-2026 08:03 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని మేడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రతిభ చాటిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రథమ ర్యాంకర్‌ ఎం. చందన ప్రతిష్ఠాత్మక ట్రిపుల్ ఐటీ బాసరలో సీటు సాధించగా, ఆయేషా సిద్దిఖ్ ద్వితీయ ర్యాంకర్‌గా నిలిచారు. పదవీ విరమణ పొందిన ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు శుక్రవారం తన సొంత ఖర్చులతో విద్యార్థినులను ఘనంగా సన్మానించి, నగదు బహుమతులు, పుస్తకాలను అందజేశారు. విద్యార్థులను ప్రోత్సహించిన శ్రీనివాసరావు చొరవను ప్రధానోపాధ్యాయులు ఎల్. సత్య ప్రసాద్, పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు.