రానున్న గోదావరి పుష్కరాలకు తగిన ఏర్పాట్లు చేయాలి
నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
ఖానాపూర్,(విజయక్రాంతి): రానున్న గోదావరి నది పుష్కరాలకు తగిన ఏర్పాట్లు చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఖానాపూర్ మండలంలోని గోదావరి పుష్కర ఘాట్ను ఆయన పరిశీలించారు. ఈ మేరకు అధికారులతో మాట్లాడుతూ పుష్కరాల నిర్వహణకు ఇప్పటినుండే తగిన ఏర్పాట్లు చేయాలని భక్తులు పుష్కర ఘాట్లకు చేరుకునే విధంగా తగిన రోడ్డు సౌకర్యం కల్పించాలని అన్నారు. భక్తులకు పుణ్యస్నానాలు ఆచరించేందుకు తగు ఏర్పాట్లకు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. ఆయనతోపాటు అదనపు కలెక్టర్ బి వెంకటేశ్వర్లు, తాసిల్దార్ సుజాత రెడ్డి, ఎంపీడీవో రాధా రాథోడ్, మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మహమ్మద్ షోయబ్ హుస్సేన్, అధికారులు తదితరులు ఉన్నారు.






