9 May, 2026 | 5:31 PM

Breaking News

వెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు   •   అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు   •   పాత బిల్లుల పేరిట కొత్త పాలకవర్గంపై ఒత్తిడి?   •   కాకతీయ కళల జాతర సాంస్కృతిక పోటీలు ప్రారంభం   •   పేదల మెరుగైన జీవితం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమే   •   కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులను కలిసిన ఎర్ర విజయ్ రావు   •   సుల్తానాబాద్ లో జాతీయ పక్షి నెమలి మృతి   •   ధాన్యం కొనాలని ఇందారంలో రైతుల రాస్తారోకో   •   సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •  

సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర

09-05-2026 04:46 PM

సత్తుపల్లి(విజయక్రాంతి): సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన అనంతరం, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే శ్రీ సండ్ర వెంకట వీరయ్య చొరవతో, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ తాతా మధు  సిఫార్సుతో దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఖమ్మంలోని తెలంగాణ భవన్‌లో పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీ తాతా మధు మాజీ ఎమ్మెల్యే శ్రీ సండ్ర వెంకట వీరయ్య  మాజీ జడ్పీ చైర్మన్ శ్రీ లింగాల కమల్ రాజు  లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ... కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరుపేదలకు భరోసా కల్పించేందుకు ఆరోగ్యశ్రీతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నవారికి సీఎంఆర్ఎఫ్ పథకాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. గతంలో సీఎంఆర్ఎఫ్ ఏ రకంగా ఉండేదో, ఇప్పుడు ఏ రకంగా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు.

గతంలో లక్షల రూపాయల నుంచి 15 లక్షల రూపాయల వరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించిన సందర్భాలు అనేకం ఉన్నాయని తెలిపారు. అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని సరిగా అమలు చేయకపోవడం గమనార్హమని విమర్శించారు. 10 లక్షల రూపాయల బిల్ ఉన్న వారికి కేవలం 30 వేలు లేదా 40 వేల రూపాయల చెక్కులు మాత్రమే విడుదల చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ పథకాన్ని పునరాలోచించి, నిరుపేదలకు నిజమైన సహాయం అందించేలా చూడాలని సండ్ర వెంకట వీరయ్య కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బెల్లం వేణు, పగడాల నాగరాజు, పేరా వెంకటేశ్వరరావు, పాషా, అప్పారావు, బలుసు మురళీకృష్ణ, లింగన్నబోయిన సతీష్ తదితరులు పాల్గొన్నారు.